Header Banner

సాయిపల్లవి కోసం 'క్యూ' కడుతున్న కథలు! యూత్ లోను అదే స్థాయిలో ఫాలోయింగ్..

  Wed Mar 12, 2025 20:43        Entertainment

సినిమా ప్రపంచం... ఇక్కడ అమ్మ పాత్రను పోషించేవారు కూడా అందంగానే కనిపించాలనే లెక్కలుంటాయి. అలాంటిది హీరోయిన్ గ్లామరస్ గా కనిపించాలని అనుకోకుండా ఎలా ఉంటారు? ఒకవేళ గ్లామరస్ గా కనిపించే ఆలోచన లేకపోతే ఇటువైపు రావడమే అనవసరం అనే మాటలు వినిపిస్తూనే ఉంటాయి. ఈ కారణంగానే నటనను మాత్రమే నమ్ముకుని రావడానికి చాలామంది హీరోయిన్స్ భయపడుతూ ఉంటారు. కానీ గ్లామరస్ గానే కాదు... నటన పరంగా కూడా ఆకట్టుకోవచ్చని నిరూపించిన కథానాయికలు ఇక్కడ చాలా తక్కువమంది కనిపిస్తారు. అలాంటివారిలో సౌందర్య, స్నేహ, నిత్యామీనన్ వంటివారి పేర్లు కనిపిస్తాయి. ఆ జాబితాలో ఇప్పుడు వెలిగిపోతున్న పేరే సాయిపల్లవి. ఫ్యామిలీ ఆడియన్స్ ఆమెను ఇప్పుడు ఒక హీరోయిన్ గా చూడటం లేదు... తమ ఇంటి అమ్మాయిగా భావిస్తున్నారు. ఆమె సినిమాలకి కుటుంబ సమేతంగా వెళుతున్నారు. 

 

ఇది కూడా చదవండి: విద్యారంగంలో సంస్కరణలపై మండలిలో స్వల్పకాలిక చర్చ! ఆ శాఖను అడిగి మరీ తీసుకున్నా..

 

నటన పరంగానే కాదు... డాన్స్ పరంగా కూడా సాయిపల్లవి నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది. మలయాళ, తమిళ, తెలుగు సినిమాల మీదుగా ఆమె ప్రయాణం బాలీవుడ్ వరకూ వెళ్లింది. సాయిపల్లవి ఉంటే ఆ ప్రాజెక్టు క్రేజ్, మార్కెట్ పెరగడానికి ఎక్కువ సమయం పట్టడం లేదు. ఇక అది లేడీ ఓరియెంటెడ్ కథ అయితే ప్రత్యేకించి చెప్పవలసిన పనేలేదు. అందువల్లనే సాయిపల్లవి కోసం ఇప్పుడు చాలామంది మేకర్స్ వెయిట్ చేస్తున్నట్టు టాక్. సాయిపల్లవి చేసే సినిమాలలో సహజంగానే ఆమె పాత్రకి ప్రాధాన్యత ఉంటుంది. ఇక నాయిక ప్రధానమైన పాత్రలలో ఆమె మరింత జీవిస్తుంది. ఎంతటి బలమైన కథనైనా ఆడియన్స్ వరకూ తీసుకుని వెళ్లగలిగే  సత్తా ఆమెకి ఉంది. అందువలన చాలామంది మేకర్స్ ఆమెను దృష్టిలో పెట్టుకుని కథలను తయారుచేసుకుంటున్నారు. ఆ కథలను ఆమెకు వినిపించడం కోసం గట్టిగానే ట్రై చేస్తున్నారట. ఒకేసారి ఇన్ని భాషల నుంచి ఇంతటి క్రేజ్ ను... డిమాండ్ ను తెచ్చుకోవడం నిజంగా గొప్ప విషయమే.

 

ఇది కూడా చదవండి: వైసిపి మరో బిగ్ షాక్! కీలక నేతలు నోటీసులు… ఎన్ని కేసులు నమోదు ఆంటే!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ముగ్గురు ఐపీఎస్‌లకు ఊహించని షాక్... కూటమి సర్కార్ కీలక నిర్ణయం! వైసీపీ హయాంలో అక్రమాలు..!

 

రైల్వే ప్రయాణికులకు గమనిక.. ఆ నాలుగు రైళ్లు ఇకపై అక్కడ నుంచి బయలుదేరుతాయి..

 

వల్లభనేని వంశీకి మళ్లీ భారీ షాక్.. రిమాండ్ అప్పటి వరకు పొడిగింపు.!

 

నాకే సిగ్గుచేటుగా ఉంది.. బయటపడుతున్న రోజా అక్రమాల గుట్టు! ఆడుదాం ఆంధ్రా పై విచారణ..

 

హైకోర్టు కీలక ఆదేశాలు.. పోసాని కృష్ణమురళికి బెయిల్.. షరతులు వర్తిస్తాయి!

 

ఏపీలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన ఫిక్స్..! నేడు నామినేషన్లు దాఖలు!

 

బోరుగడ్డ అనిల్ స్కెచ్ ఫెయిల్! పోలీసుల దర్యాప్తులో బయటపడుతున్న వాస్తవాలు..!

 

ఏపీ ఎమ్మెల్సీ నామినేషన్లకు క్లైమాక్స్.. కూటమి అభ్యర్థుల జాబితా ఫైనల్! నేడు కీలక అభ్యర్థుల నామినేషన్!

 

వంశీ కేసులో చివరి కౌంట్‌డౌన్! పోలీసుల కస్టడీ పిటిషన్ పై నేడే తీర్పు... వంశీ భవిష్యత్తు ఏమిటి?

 

ఐదేళ్ల తర్వాత అమరావతిలో మళ్లీ సందడి.. భారీ పనులకు టెండర్ల ప్రక్రియ! రికార్డు స్థాయి ప్రాజెక్టులు..!

 

జనసేన ప్లీనరీకి ముహూర్తం ఖరారు.. మార్పులపై పవన్ కీలక ప్రకటన! వివాదాస్పద నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #SaiPallavi #Actress #Tollywood